తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ ఉద్యోగుల స్థానంలో ఇక కృత్రిమ మేధ! - ఏఐ ఆల్గారిథమ్​

మైక్రోసాఫ్ట్ తన వార్తావిభాగంలో పనిచేసే ఎడిటోరియల్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయానికి కరోనా సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల స్థానాన్ని కృత్రిమ మేధతో భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

Microsoft cuts editorial staff, to replace them with AI
మైక్రోసాఫ్ట్: ఉద్యోగుల స్థానంలో కృత్రిమ మేధ!

By

Published : May 30, 2020, 5:12 PM IST

Updated : Jun 3, 2020, 5:15 PM IST

సాఫ్ట్​వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఎడిటోరియల్ సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సియాటెల్ టైమ్స్ పేర్కొంది.

"స్టాఫ్ ఏజెన్సీ అక్వెంట్​, ఐఎఫ్​జీ, మాక్​ కన్సల్టింగ్ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న... సుమారు 50 మంది న్యూస్ ప్రొడక్షన్​ సిబ్బందిని జూన్​ 30 తరువాత తొలగించడానికి మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఇకపై వీరి స్థానంలో ఏఐ అల్గారిథమ్​ని ఉపయోగించి సంపాదకీయాలను నిర్వహించనుంది."

- సియాటెల్ టైమ్స్​

కరోనా ప్రభావం లేదు..

మైక్రోసాఫ్ట్ నిర్వహించే వార్తా విభాగం 'మైక్రోసాఫ్ట్​ న్యూస్'​. ఇది ఎంఎస్​ఎన్​.కామ్​ని నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వీటిలో పనిచేసే ఉద్యోగులనే తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. కరోనా సంక్షోభానికి... తాజా నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేవలం సంస్థ అభివృద్ధి కోసమే తాజా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఏఐ అల్గారిథమ్​

ఏఐ అల్గారిథమ్.. ప్రచురణ భాగస్వాముల నుంచి వచ్చే ట్రెండింగ్ వార్తలను గుర్తించడం, ముఖ్యమైన అంశాలను తిరిగి రాయడం, మెరుగైన చిత్రాలు, స్లైడ్ షోలను జోడించడం లాంటివి చేస్తుంది.

ఇదీ చూడండి:మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

Last Updated : Jun 3, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details