ఎమ్ఐ నోట్ 10 పేరుతో.. మరో పవర్ హౌస్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది షియోమీ సంస్థ. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 మెగా పిక్సల్ కెమెరాతో ఈ ఫోన్ను తీసుకొస్తోంది.
తాజా సమాచారం ప్రకారం నవంబర్ 5న 'ఎమ్ఐ సీసీ9 ప్రో'ను చైనాలో విడుదల చేయనున్నారు. తరువాత దాని గ్లోబర్ వెర్షన్ 'ఎమ్ఐ నోట్ 10' స్మార్ట్ఫోన్ను నవంబర్ 14న పోలాండ్లో లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. భారత్లో ఈ ఫోన్ లాంచ్కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సర్టిఫికేషన్ లీక్స్ ప్రకారం ఈ రెండు స్మార్ట్ఫోన్లకీ ఒకే మోడల్ నంబర్ ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఎమ్ఐ నోట్ 10 ఫీచర్లు
- ఈ షియోమీ నూతన ఫోన్లో 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుకవైపు 5 కెమెరాలు ... 20 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫొటో లెన్స్, 12 మెగా పిక్సెల్ పొట్రెయిట్ షూటర్ ఉండే అవకాశం ఉంది. టెలిఫొటో లెన్స్కు 10 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 50 ఎక్స్ డిజిటల్ జూమ్ సామర్థ్యమున్నట్లు తెలుస్తోంది.
- ఎమ్ఐ సీసీ9 ప్రొలో క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్, ఎమ్ఐ నోట్ 10లో స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
- 6.47 అంగుళాల డిస్ప్లే
- 5170 ఎంఏహెచ్ బ్యాటరీ