పంజాబ్ నేషనల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విలీనం అనంతరం రూ.18 లక్షల కోట్ల వ్యాపారంతో ఎస్బీఐ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు.
" విలీన ప్రక్రియకు కొంత సమయం పట్టనుంది, ఇది ఏప్రిల్ 1 నాటికి పూర్తవుతుంది. విలీనం కోసం న్యాయ, నియంత్రణ ప్రక్రియలు పూర్తి కావడం సహా మూడు బ్యాంకుల బోర్డులు ఆమోదం తెలపాలి. విలీన ప్రక్రియ తర్వాత ఉద్యోగుల తగ్గింపు ఉండబోదు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా అమలు చేయం. "