లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్ బెంజ్ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఆయిల్ లీకేజీ లోపం తలెత్తొచ్చనే అంచనాలతో.. ఈ ఏడాది చివరి నుంచి 668,954 కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే చైనాలో మాత్రమే కార్లను రీకాల్ చేయాలని భావించడం గమనార్హం.
2013 డిసెంబర్ నుంచి 2017 జూన్ మధ్య తయారైన సీ-క్లాస్, ఈ-క్లాస్, వీ-క్లాస్, జీఎల్కే-క్లాస్, సీఎల్ఎస్-క్లాస్ సహా పలు ఇతర మోడళ్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. చైనా మీడియా కథనం ప్రకారం డిసెంబర్ 18న రీకాల్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్లన్నింటికీ డీలర్లు ఉచితంగానే రీప్లేస్మెంట్ చేయనున్నారు.