తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 6:25 AM IST

Updated : Mar 11, 2021, 6:43 AM IST

ETV Bharat / business

సగటు జీతం రూ.29లక్షలు..100 శాతం ప్లేస్‌మెంట్

కరోనా సంక్షోభం ప్రభావం ఆ విద్యార్థుల నియామకంపైన ఏమాత్రం పడలేదు. ఐఐఎం కోల్​కతాకు చెందిన ఎంబీఏ విద్యార్థులు సగటున రూ.29 లక్షల జీతంతో వివిధ సంస్థల్లో ప్లేస్​మెంట్​ సంపాదించారు. మొత్తం 467 మంది విద్యార్థుల కోసం 520 ఆఫర్లు వచ్చాయని ఐఐఎం కోల్​కతా వెల్లడించింది.

mba iim calcutta
సగటుజీతం రూ.29లక్షలు..100శాతం ప్లేస్‌మెంట్

సగటు జీతం రూ.29లక్షలు..100 శాతం ప్లేస్‌మెంట్‌తో ఐఐఎం కోల్‌కతా 2021 ఎంబీఏ బ్యాచ్ విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొవిడ్‌ కారణంగా కొద్దికాలం పరిశ్రమలు ఒడుదొడుకులకు గురవుతున్నప్పటికీ.. ఈ విద్యార్థులకు వేతన ప్యాకేజీలు పెరగడం విశేషం. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాంపస్‌ డ్రైవ్‌ గురించి ఐఐఎం వెల్లడించింది.

మొత్తం 467 మంది విద్యార్థుల కోసం 520 ఆఫర్లు వచ్చాయని ఐఐఎం కోల్‌కతా వెల్లడించింది. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 172 సంస్థలు పాల్గొన్నాయని, తమ ఫ్లాగ్‌షిప్ ఎంబీఏ ప్రొగ్రాం కింద 100శాతం మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపింది. సగటు, మధ్యస్థాయి జీతాలు రూ. 29 లక్షలు, రూ.27లక్షలుగా ఉన్నాయని పేర్కొంది. పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఈ కామర్స్‌ సంస్థలు ఈ నియమాకాల్లో కీలకంగా వ్యవహరించాయి.

మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం వంటి తదితర సంస్థలు..వివిధ ఉత్పత్తుల నిర్వహణ, ఫిన్‌టెక్ విభాగాల్లో విధుల కోసం 24 శాతం(111) మందిని నియమించుకున్నట్లు విద్యాసంస్థ తెలిపింది. అత్యధికంగా కన్సల్టింగ్‌ రంగం 149 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 90 మంది విద్యార్థులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్, ప్రైవేటు ఈక్విటీ వెంచర్ కాపిటల్‌ ఫర్మ్స్‌లో నియమితులయ్యారు.

ఇదీ చదవండి :2020-21లో ఇళ్ల విక్రయాలు 34% డౌన్!

Last Updated : Mar 11, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details