మళ్లీ డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) స్పష్టం చేసింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్ వాహనాల(maruti suzuki diesel cars) ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని పేర్కొంది. అందువల్ల అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే కార్ల ఉత్పత్తిపైనే కంపెనీ దృషి సారిస్తోందని ఎంఎస్‌ఐ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సి.వి.రామన్ తెలిపారు. ఇప్పటికే సెలెరియోకు(maruti suzuki celerio 2021) అమర్చిన కే10-సి ఇంజిన్ ఈ తరహాలో రూపొందించిందేనని, లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వివరించారు. కాలుష్య ఉద్గారాల తగ్గింపు కోసం తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
భవిష్యత్తులో హైబ్రిడ్(maruti suzuki hybrid vehicles), విద్యుత్తు వాహనాలను సంస్థ ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పుడు 10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనానికి అనువైన ఇంజిన్లున్నాయని, 2023 నాటికి 20 శాతం ఇథనాల్ కలుస్తుంది కనుక, అందుకు తగిన ఇంజిన్ రూపొందిస్తామన్నారు. మొత్తం ప్రయాణికుల వాహనాల్లో(maruti suzuki passenger vehicles) డీజిల్ విభాగం వాటా 17 శాతమన్నది పరిశ్రమ అంచనా. 2013-14లో ఇది 60 శాతం కావడం గమనార్హం.