తెలంగాణ

telangana

ETV Bharat / business

జనవరి నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం - 2020 జనవరి నుంచి పెరగనున్న మారుతీ కార్ల ధరలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా.. 2020 జనవరి నుంచి తమ కంపెనీ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

Maruti Suzuki to increase prices from January to offset rising input costs
జనవరి నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!

By

Published : Dec 3, 2019, 2:38 PM IST

2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతామని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గతేడాది ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల వ్యయం భారీగా పెరిగిపోయిందని... ఇది కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపిందని మారుతీ సుజుకి ఇండియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

"2020 జనవరి నుంచి వివిధ మోడళ్ల ధరల్లో పెరుగుదల ఉంటుంది. కార్ల ఉత్పత్తికి అవుతున్న అదనపు వ్యయాన్ని కొంత వినియోగదారులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది."- మారుతీ సుజుకి ఇండియా

2020 జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు... మోడళ్లను బట్టి వేర్వేరుగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ స్మాల్​ కారు ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్​ వెహికల్ ఎక్స్​ఎల్​ 6 వరకు.. రూ.2.89 లక్షల నుంచి రూ.11.47 లక్షల వరకు (దిల్లీ ఎక్స్​ షోరూమ్​) సంస్థ విక్రయిస్తోంది.

ఇదీ చూడండి:'వారిది మోసపూరిత రాజకీయం.. మాది ప్రజాసేవ'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details