తెలంగాణ

telangana

ETV Bharat / business

జనవరి నుంచి ఆ కార్లు మరింత కాస్ట్​లీ - ఆడి ధరల పెంపు

Maruti rate hike: ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ.. మరోమారు కార్ల ధరన పెంచనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇది అమల్లోకి రానుంది.

Maruti Suzuki to hike vehicle prices from January
మారుతీ ధరల పెంపు

By

Published : Dec 2, 2021, 5:39 PM IST

Maruti suzuki rate hike: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మరో రేట్​ 'హైక్​'కు సిద్ధపడింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా.. వచ్చే ఏడాది జనవరిలో వాహనాల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. అయితే ఏ మోడల్​కు ఎంత పెంచనుందనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు.

"గత కొంతకాలంగా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల సంస్థపై భారం పడుతోంది. ఈ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదు. జనవరిలో కార్ల రేట్లు పెంచుతున్నాం."

-- మారుతీ సుజుకీ ఇండియా.

2021లో సంస్థ ఇప్పటికే మూడుసార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4శాతం, ఏప్రిల్​లో 1.6శాతం, సెప్టెంబర్​లో 1.9శాతం.. మొత్తం మీద ఈ ఒక్క ఏడాదిలోనే ధరలను 4.9శాతం పెంచింది.

ఆల్టో నుంచి ఎస్​యూవీ వరకు మారుతీలో ఎన్నో మోడళ్లు ఉన్నాయి. దిల్లీ ఎక్స్​ షోరూం ధరలు రూ.3.15 లక్షల నుంచి మొదలవుతాయి.

ఆడి కూడా..

Audi rate in India: జర్మనీకి చెందిన విలాస కార్ల సంస్థ ఆడి కూడా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని మోడళ్లపై 3శాతం ధరను పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో ఏ4, ఏ6, ఏ8 ఎల్​, క్యూ2, క్యూ5, క్యూ8, ఎస్​5 స్పోర్ట్​బ్యాక్​, ఆర్​ఎస్​ 5 స్పోర్ట్​బ్యాక్​, ఆర్​ఎస్​ 7, ఆర్​ఎస్​ క్యూ8, ఈ-ట్రాన్​ 50, ఈ-ట్రాన్​ 55, ఈ-ట్రాన్​ స్పోర్ట్​బ్యాక్​ 55, ఈ-ట్రాన్​ జీటీ, ఆర్​ఎస్​ ఈ-ట్రాన్​ జీటీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2021లోనే 9 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది ఆడి. వీటిల్లో రెండు విద్యుత్​ కార్లు ఉన్నాయి.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details