దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. మార్చి నెలలో వివిధ మోడళ్లపై ఆఫర్లను ప్రకటించిన దిగ్గజ సంస్థ.. ఉత్పత్తి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పెంపు ద్వారా.. వినియోగదారులపై కొంత భారం పడుతుందని, అయితే ముడిపదార్థాల ధరలు పెరిగినందునే పెంపు అనివార్యమని పేర్కొంది సంస్థ. ఆయా మోడళ్లను బట్టి ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.