దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 1,34,885 కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. వేగనార్, బాలినో మోడళ్ల ఫ్యూయల్ పంప్లలో సమస్యలు తలెత్తొచ్చని గుర్తించి.. వాటిని సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
రీకాల్ జాబితాలోని కార్లు ఇవే..
2018 నవంబర్ 15 నుంచి 2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వేగనార్(1లీటర్ ఇంజిన్) కార్లు, 2019 జనవరి 8 నుంచి 2019 నవంబర్ 4 మధ్య తయారైన బాలినో(పెట్రోల్ వేరియంట్లు) మోడళ్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది మారుతీ.