తెలంగాణ

telangana

ETV Bharat / business

'మారుతీ' షాక్​- కార్ల ధరలు రూ.22 వేలు పెంపు! - ఆల్టో కారు ధర పెంపు

మారుతీ సుజుకీ షాకింగ్ ప్రకటన చేసింది. కార్ల ధరలు రూ.22,500 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఏఏ మోడల్​పై ఎంత ధర పెరగనుందనే విషయంపై మారుతీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Maruti Suzuki cars
మారుతీ సుజుకీ కార్లు

By

Published : Apr 16, 2021, 3:08 PM IST

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు పెరగటమే ఇందుకు కారణమని వెల్లడించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.22,500 వరకు పెంచనున్నట్లు పేర్కొంది.

సెలెరియో, స్విఫ్ట్​ వంటి కార్లు.. ధరల పెరిగే మోడళ్లలో ప్రధానంగా ఉన్నాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.

పలు బడ్జెట్ మోడళ్లు అయిన ఆల్టో, ఎస్​ క్రాస్​ వంటి కార్ల ధరలు (ఎక్స్​ షోరూం) ప్రస్తుతం.. రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షలుగా ఉన్నాయి. తాజా ధరల పెంపు నిర్ణయంతో వీటి ధరలు దాదాపు 1.6 శాతం పెరగొచ్చని మారుతీ సుజుకీ వివరించింది.

ఈ ఏడాది జనవరిలో కూడా మారుతీ సుజుకీ పలు ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.34 వేల వరకు పెంచింది.

ఇదీ చదవండి:కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!

ABOUT THE AUTHOR

...view details