దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భారీ రీకాల్ (Maruti recall cars) ప్రకటించింది. సియాజ్, ఎర్టీగా, విటారా బ్రెజ్జా, ఎక్స్ఎల్6 సహా పలు ఇతర మోడళ్లలోని ఇంజిన్‌లో లోపాలను (Maruti recalling models) గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆయా మోడళ్లలోని పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే లోపాలు ఉన్నట్లు స్పష్టం చేసింది మారుతీ సుజుకీ.
2018 మే 4 నుంచి 2020 అక్టోబర్ 27 మధ్య ఉత్పత్తి అయిన మోడళ్లలో మాత్రమే ఈ లోపలు ఉన్నట్లు పేర్కొంది కంపెనీ. లోపాలను సరిచేసేందుకు 1,81,754 యూనిట్లను రీకాల్ చేయనున్నట్లు తెలిపింది.
వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లోపాలున్నట్లు అనుమానమున్న కార్లన్నింటిని వెనక్కి రప్పించనున్నట్లు వివరించింది మారుతీ సుజుకీ. రీకాల్ చేసిన కార్లలో నిజంగానే లోపాలు ఉంటే.. మోటార్ జనరేటర్ యూనిట్‌ను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు తెలిపింది. ఇది ఇంజిన్‌కు అదనపు శక్తిని ఇస్తుంది.
ఆయా కార్ల యజమానాలను కంపెనీనే నేరుగా సంప్రదిస్తుందని.. మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. కార్లలో లోపాలున్న విడిభాగాల మార్పిడి నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అప్పటి వరకు రీకాల్ విభాగంలో ఉన్న కార్లను నీళ్లలో నడిపించడం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ భాగాలను నీటితో కడగటం వంటివి చేయొద్దని వినియోగదారులకు సూచించింది.
ఇదీ చదవండి:వాట్సాప్‌కు రూ.2 వేల కోట్ల జరిమానా!