తెలంగాణ

telangana

ETV Bharat / business

కారు కొనాలా? అదిరే డిస్కౌంట్ల గురించి తెలుసుకోండి..

కార్​ కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు శుభవార్తను అందించాయి. పండుగ సీజన్ సమీపిస్తుండటం సహా లాక్​డౌన్​లో పడిపోయిన విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీల్లో మారుతీ, టాటా, హుందాయ్​, హోండాలు ఉన్నాయి. మరి ఈ కంపెనీలకు చెందిన ఏ మోడల్​పై ఎంత డిస్కౌంట్​ ఉందో తెలుసుకోండి..

By

Published : Aug 19, 2020, 6:38 PM IST

HUGE DISCOUNTS ON CARS
కార్లపై భారీ డిస్కౌంట్లు

కరోనా వైరస్​ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో కార్ల అమ్మకాలు ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోయాయి. లాక్​డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు కార్ల తయారీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. పండుగ సీజన్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో దిగ్గజ కార్ల తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి. మరిన్ని సంస్థలు త్వరలోనే ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఏ కంపెనీ.. ఏ మోడల్​పై.. ఎంత ఆఫర్ ఇస్తోంది? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతీ సుజుకీ

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రారంభ స్థాయి మోడల్ ఆల్టో 800 నుంచి మిడ్​ రేంజ్​లో భారీగా అమ్ముడయ్యే స్విఫ్ట్​, ఇతర మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కనిష్ఠంగా రూ.20 వేల నుంచి గరిష్ఠంగా రూ.47 వేల వరకు డిస్కౌంట్​ ఇస్తున్నట్లు తెలిపింది. బీమా, ఇతర యాక్సెసరీస్​ కొనుగోలు చేసే వారికి అదనపు ప్రయోజనాలు కూడా అందించనున్నట్లు తెలిపింది.

మారుతీ సుజుకీ

హుందాయ్​

హుందాయ్​ ప్రారంభ స్థాయి మోడల్​, భారీ ఆదరణ ఉన్న శాంత్రోపై రూ.35 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. మిడ్​ రేంజ్​లో ఎక్కువగా అమ్ముడయ్యే ఐ10, ఐ20 మోడళ్లపై కూడా రూ.15 వేల నుంచి రూ.25 వేలు డిస్కౌంట్ ఇస్తోంది.

హుందాయ్

హోండా

ఇతర కంపెనీలతో పోల్చుకుంటే.. జపాన్​కు చెందిన హోండా అత్యధికంగా రూ.2.5లక్షల వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. హోండా సివిక్ డీజిల్ వేరియంట్​పై ఈ తగ్గింపు ప్రకటించింది. హోండాలో ఎక్కువగా ఆదరణ దక్కించుకున్న సీటీ మోడల్​పై కూడా రూ.1.6 లక్షల వరకు డిస్కౌంట్​ ఇస్తోంది.

హోండా

టాటా

టాటా మోటార్స్ కనిష్ఠంగా రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.85 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. డిస్కౌంట్​లో లభించే మోడళ్లలో నెక్సాన్​, టియాగో, టిగోర్, హారియర్ వంటి మోడళ్లు ప్రధానంగా ఉన్నాయి.

టాటా

ఇదీ చూడండి:ఈ-కామర్స్​ విస్తరణకు రిలయన్స్ దూకుడు

ABOUT THE AUTHOR

...view details