తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లోకి సెలేరియో కొత్త మోడల్-​ ధర తెలుసా? - ట్రయంఫ్ బానవిల్ బైక్ ధర

భారత్ మార్కెట్లోకి మారుతీ సుజుకీ శుక్రవారం బీఎస్​-6 ప్రమాణాలతో ఎస్​-సీఎన్​జీ వేరియంట్ సెలేరియో కార్​​ను విడుదల చేసింది. ప్రముఖ అడ్వెంచర్ బైక్​ల తయారీ సంస్థ ట్రయంఫ్ రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వీటి ఫీచర్లు, ధరల వివరాలు మీ కోసం.

maruti celerio price
మార్కెట్లోకి మారుతీ కొత్త సెలేరియో

By

Published : Jun 12, 2020, 5:15 PM IST

బీఎస్​ 6 ప్రమాణాలతో కూడిన ఎస్​-సీఎన్​జీ వేరియంట్ సెలేరియో కార్​ను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ). ఈ మోడల్ ధర (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.5.36 లక్షలు, రూ.5.61 లక్షలు, రూ.5.68 లక్షలుగా నిర్ణయించింది.

ఈ మోడల్ 30.47/కేజీ మైలేజ్ ఇస్తుందని మారుతీ సుజుకీ వెల్లడించింది.

మారుతీ ఎస్​-సీఎన్​జీ సెలేరియో

సెలేరియో మోడల్​ను ఇప్పటికే 5 లక్షల మంది కొనుగోలు చేయగా.. సీఎన్​జీ బీఎస్​ 6 వేరియంట్​ను అదే విధంగా ఆదరిస్తారని మారుతీ భావిస్తోంది.

ట్రయంఫ్ బానవిల్ బ్లాక్ ఎడిషన్..

బ్రిటన్​కు చెందిన ప్రముఖ మోటార్​ సైకిళ్ల సంస్థ ట్రయంఫ్ భారత్​లో బానవిల్​ బ్లాక్ ఎడిషన్ టీ 100, టీ 120 మోడళ్లను విడుదల చేసింది.

బానవిల్ బ్లాక్ ఎడిషన్

900 సీసీ ఇంజిన్ ఇంజిన్ బానవిల్ టీ 100 ధర రూ.8.87 లక్షలుగా, 1200 సీసీ ఇంజిన్ బానవిల్ టీ 120 బైక్ ధర రూ. 9.97 లక్షలుగా నిర్ణయించింది ట్రయంఫ్. ఈ బైల్​లతో పాటు బైక్​రైడింగ్ ప్రియులకోసం150 రకాలకుపైగా యాక్సెసిరీస్​లను అందుబాటులో ఉంచినట్లు ట్రయంఫ్ ఇండియా తెలిపింది.

ఇదీ చూడండి:ఆదాయం లేకుంటే సగం జనాభా జీవనం నెల రోజులే!

ABOUT THE AUTHOR

...view details