మారుతీ సుజుకీ తమ ప్రారంభ స్థాయి ఆల్టో మోడల్‌ను విడుదల చేసి 20 ఏళ్లు పూర్తి చేసుకోగా, సుమారు 40 లక్షలకు పైగా కార్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ మోడల్ ఒక ఐకానిక్ బ్రాండ్‌కు నిదర్శనమని, మారుతున్న యువతరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని రూపొందించామని కంపెనీ తెలిపింది.
'20 ఏళ్లలో 40 లక్షల ఆల్టో విక్రయాలు' - Maruti Alto completes two decades
మారుతీ సుజుకీ ఆల్టో మోడల్ కారును విడుదల చేసి 20 ఏళ్లు పూర్తయింది. ఈ రెండు దశాబ్దాల్లో సుమారు 40 లక్షలకు పైగా కార్లు విక్రయించినట్లు తెలిపింది ఆ సంస్థ.
!['20 ఏళ్లలో 40 లక్షల ఆల్టో విక్రయాలు' Maruti Alto completes two decades, over 40 lakh units sold since debut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9167498-thumbnail-3x2-maruti.jpg)
'గత 20 ఏళ్లుగా భారతీయ ప్రయాణికుల ప్రయాణ విధానాన్నే ఆల్టో మార్చేసింది. గత 16 ఏళ్లుగా విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింద'ని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్-సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. మారుతీ 2000 సంవత్సరంలో ఆల్టో మోడల్‌ను విడుదల చేయగా, 2008లో 10 లక్షల మార్కును దాటింది. 2012లో 20 లక్షల మార్కు, 2016లో 30 లక్షల మార్కును అధిగమించింది. దేశీయంగానే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియాలోని 40కు పైగా దేశాలకూ ఆల్టో ఎగుమతి అయ్యింది.
ఇదీ చూడండి:'5జీ'తో ఐఫోన్ 12 సిరీస్- ధరలు ఇలా...