తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్​ మెరుపులు- మళ్లీ 11,500పైకి నిఫ్టీ - లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 11,500 మార్క్​ను దాటింది. టీసీఎస్ షేర్లు రికార్డు స్థాయిలో లాభాలు గడించాయి.

stock market news Telugu
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

By

Published : Oct 5, 2020, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 276 పాయింట్లు పుంజుకుని.. 38,974 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 11,503 వద్ద సెషన్​ను ముగించింది.

అన్​లాక్​తో దేశ ఆర్థిక కార్యకలకాపాలు రికవరీ దిశగా కదులుతున్నట్లు విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ఐటీ​ దిగ్గజం టీసీఎస్​ బై బ్యాక్ అంశాన్ని పరిశీలించనున్నట్లు రెగులేటరీకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సంస్థ షేర్లు 7 శాతానికిపైగా లాభాన్ని గడించాయి. ఈ పరిణామాలన్నీ సోమవారం లాభాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు కూడా లాభాలకు కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,264 పాయింట్ల అత్యధిక స్థాయి, 338,820 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,578 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,452 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​, టాటా స్టీల్​, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్​ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.

బజాజ్ ఫిన్​సర్వ్​, భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, పవర్​గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి. షాంఘై సూచీ సెలవులో ఉంది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి సోమవారం 16 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.29 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 2.16 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.12 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:టీసీఎస్​ ఎం-క్యాప్​ @ 10 లక్షల కోట్లు

ABOUT THE AUTHOR

...view details