తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​: అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం కీలకం - వాణిజ్య యుద్ధం

స్టాక్ మార్కెట్లు ఈ వారం రేంజ్ బౌండ్​లో కొనసాగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడతున్నారు. దేశవ్యాప్తంగా ఈ వారం చెప్పుకోదగ్గ కీలక పరిణామాలు లేని కారణంగా.. అంతర్జాతీయ అంశాలపైనే మదుపురులు దృష్టి సారించొచ్చని అంచనా వేస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు

By

Published : Nov 17, 2019, 5:47 PM IST

అంతర్జాతీయ అంశాలే ఈ వారం స్టాక్​ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దేశీయ పరిణామాలేవీ ఈ వారం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల ప్రకటన దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రధాన కంపెనీలు ఫలితాలు ప్రకటించిన కారణంగా మార్కెట్లపై వీటి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

"ఈ వారం ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం అంశం మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. పెద్దగా అనుకూల పరిణామాలు లేని కారణంగా.. రేంజ్​ బౌండ్​లో సూచీలు కొనసాగే అవకాశముంది."

-జిమీత్​ మోదీ, సామ్​కో సెక్యూరిటీస్ సీఈఓ

అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయం సహా ఇతర కీలక డేటా.. మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశముందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తాఫా నదీమ్ అన్నారు. ముఖ్యంగా.. వాణిజ్య యుద్ధం ముగింపు లేదా తాత్కాలిక ఒప్పందానికి అమెరికా-చైనాలు సంకేతాలు ఇస్తే.. మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అక్టోబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా.. డిసెంబర్​లో జరగనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో.. ఆర్బీఐ రెపో రేటు తగ్గించే అవకాశం ఉంది. ఈ అంశంపై మదుపరులు దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, డాలర్​తో రూపాయి మారకం విలువ వంటివీ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి: ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ABOUT THE AUTHOR

...view details