ఆర్థిక మాంద్యం భయాలకు తోడు ఉద్దీపన ప్యాకేజీ మదుపరుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1068 పాయింట్లు కోల్పోయి 30 వేల 28 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 313 పాయింట్లు నష్టపోయి 8 వేల 823 వద్ద స్థిరపడింది.
భారత్ ఇంతకు ముందు కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశముందని గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ అంచనా వేయడమూ మదుపరులను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మరోవైపు రక్షణ రంగానికి చెందిన షేర్లు బాగా లాభపడ్డాయి. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సవరిస్తూ.. 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపరులు ఈ సంస్థలవైపు మొగ్గుచూపారు.