స్టాక్ మార్కెట్ల రికార్డు స్థాయి లాభాల జోరుకు గురువారం అడ్డుకట్ట పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 12,772 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ పలు నగరాల్లో లాక్డౌన్ దిశగా అడుగులు పడడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా వారంతా ఇటీవల నమోదైన భారీ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.
బ్యాంకింగ్, టెలికాం, ఆటో షేర్లు భారీగా కుదేలయ్యాయి. విద్యుత్ రంగ షేర్లు మాత్రం లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 44,230 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 43,518 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,963 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల రికార్డు స్థాయి), 12,745 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..