స్టాక్ మార్కెట్లను కరోనా కేసులు, అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి.
గత వారం విడుదలైన కీలక ఆర్థిక గణాంకాలతో దేశ రికవరీ రేటు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టమైంది. ఇలాంటి సమయాల్లో మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఈ మిశ్రమ సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
ఒకవేళ అంచనాలకు తగ్గట్లే.. ప్రభుత్వం ప్యాకేజీపై ప్రకటన చేస్తే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని జియోజిత్ ఫినాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ తెలిపారు.
కరోనా కేసులు దేశీయంగా 26 లక్షలకు చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2.15 కోట్లు దాటాయి. ఈ లెక్కలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.