స్టాక్ మార్కెట్లు (Stock market today India) వారాంతంలో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుతం 57 వేల 430 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 400 పాయింట్లు పతనమై.. ప్రస్తుతం 17 వేల 120 వద్ద ఉంది.
లాభనష్టాల్లో..
ఫార్మా రంగం (Stock market news) షేర్లు మాత్రమే కొన్ని లాభాల్లో ఉన్నాయి.
బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో డాక్టర్ రెడ్డీస్ మాత్రమే రాణిస్తోంది. బజాజ్ ఫినాన్స్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం అన్నీ 3 శాతానికిపైగా నష్టపోయాయి.
కారణాలివే..
దక్షిణాఫ్రికాలో (Corona variant south africa) గురువారం.. కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇది ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేసింది.
ఈ నేపథ్యంలోనే స్టాక్ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఐరోపా సమాఖ్య దేశాలు చాలావరకు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఫలితంగా.. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భయంతో.. తమ షేర్లను భారీ స్థాయిలో విక్రయిస్తున్నారు. ఇది మార్కెట్ల నష్టాలకు ఓ కారణం.
భారత్‌లో ప్రస్తుతానికి కరోనా భయాలు పెద్దగా లేవు. కేసులు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి:ఏడీబీ నుంచి భారత్ 3 బిలియన్ డాలర్ల రుణం.. ఎందుకంటే?