తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 558 ప్లస్​ - covid in india

STOCK MARKETS
స్టాక్​మార్కెట్లు

By

Published : Apr 27, 2021, 9:23 AM IST

Updated : Apr 27, 2021, 3:41 PM IST

15:39 April 27

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 558 పాయింట్లు పెరిగి 48,944 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 14,653 వద్దకు చేరింది.

  • ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్​ లాభాలను నమోదు చేశాయి.
  • మారుతీ సుజుకీ, ఎన్​టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, ఎం&ఎం నష్టపోయాయి.

13:13 April 27

నిఫ్టీ 120 ప్లస్​..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో 48,784 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల వృద్ధితో 14,599 వద్ద కొనసాగుతోంది.

  • ఎల్​&టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, ఎన్​టీపీసీ, నెస్లే , హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:42 April 27

మార్కెట్ల జోరు..

లోహరంగంలో కొనుగోళ్ల వెల్లువతో స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 350 పాయింట్లకుపైగా పెరిగి.. ప్రస్తుతం 48 వేల 740 ఎగువన ట్రేడవుతోంది.

నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 14 వేల 590 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

హిందాల్కో, టాటా స్టీల్​, రిలయన్స్​, అదానీ పోర్ట్స్​, ఎల్​ అండ్​ టీ లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, టెక్​ మహీంద్రా, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి. 

10:21 April 27

స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం 200 పాయింట్లకుపైగా లాభంతో.. 48 వేల 590 ఎగువన ట్రేడవుతోంది.

నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి.. 14 వేల 550 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

హిందాల్కో, టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​, రిలయన్స్​, పవర్​ గ్రిడ్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, కోటక్​ మహీంద్రా, టెక్​ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి. 

కదలికల్లో అప్రమత్తత..

అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కీలక రంగాల నుంచి మద్దతు లభిస్తుండడం సూచీల దన్నుగా నిలుస్తోంది. అయితే, సూచీల కదలికల్లో కొవిడ్‌ అప్రమత్తత స్పష్టమవుతోంది. కరోనా కేసుల విజృంభణ, ఆసియా మార్కెట్ల డీలా నేపథ్యంలో లాభాలు ఎంత మేర కొనసాగుతాయన్నది చూడాల్సి ఉంది.

08:35 April 27

లైవ్​: మిశ్రమ సంకేతాలున్నా లాభాల్లో మార్కెట్లు

క్రితం సెషన్​లో భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్​మార్కెట్లు.. జోరు కొనసాగిస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 150 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 48 వేల 530 ఎగువన కొనసాగుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో.. 14 వేల 534 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లోనివివే..

టెక్​ మహీంద్రా, హిందాల్కో, టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రాణిస్తున్నాయి. 

యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహీంద్రా, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్​ పెయింట్స్​ డీలాపడ్డాయి.

మదుపర్లు కొనుగోళ్లు జరిపిన కారణంగా.. సూచీలు సోమవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 508, నిఫ్టీ 144 పాయింట్లు పెరిగాయి. 

Last Updated : Apr 27, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details