తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూల పవనాలతో... లాభాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వచ్చే ఏడాదిలోనూ వడ్డీరేట్లు మార్చేది లేదని ప్రకటించడం, అమెరికా- చైనాల తొలి విడత వాణిజ్య చర్చలు ఫలవంతం కావచ్చనే అంచనాలే లాభాలకు కారణం.

stock market opens green
అంతర్జాతీయ సానుకూల పవనాలతో ... లాభాల్లో మార్కెట్లు

By

Published : Dec 13, 2019, 10:05 AM IST

అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫార్మా తప్ప.. లోహ, వాహన, ఇన్​ఫ్రా, ఐటీ లాంటి కీలక రంగాలు రాణిస్తున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 232 పాయింట్లు వృద్ధి చెంది 40 వేల 814 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 12, 033 వద్ద ట్రేడవుతోంది.

యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వచ్చే ఏడాదిలోనూ వడ్డీరేట్లు మార్చేది లేదని ప్రకటించడం, అమెరికా- చైనాల తొలి విడత వాణిజ్య చర్చలు ఫలవంతం కావచ్చనే అంచనాలతో మార్కెట్లు లాభాలబాట పట్టాయి. బ్రిటన్​లో ఎన్నికలు సజావుగా జరగడమూ ఇందుకు దోహదపడింది.

లాభనష్టాల్లో

టాటా మోటార్స్, ఎస్​ బ్యాంకు, టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో​ రాణిస్తున్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, సిప్లా, బీపీసీఎల్​, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్, బజాజ్​ ఫైనాన్స్​, కోటక్ మహీంద్రా నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు.. నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 28 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.55గా ఉంది.

ఇదీ చూడండి:'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'

ABOUT THE AUTHOR

...view details