తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒత్తిడిలో సూచీలు.. సెన్సెక్స్​ 200 పాయింట్లు పతనం - నిఫ్టీ

కేంద్ర ప్రభుత్వం వరస ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్టాక్​మార్కెట్లను నష్టాలు వీడట్లేదు. నేటి ఆరంభ ట్రేడింగ్​లో సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్​ 230 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 11 వేల ఎగువన ట్రేడవుతోంది.

ఒడుదొడుకుల్లో మార్కెట్లు

By

Published : Sep 16, 2019, 9:59 AM IST

Updated : Sep 30, 2019, 7:16 PM IST

స్టాక్​మార్కెట్లను ప్రతికూల సంకేతాలు వెంటాడుతున్నాయి. నేటి ట్రేడింగ్​లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సౌదీలోని ఆరాంకో చమురు క్షేత్రాలపై దాడి అనంతరం... అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లూ నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 260 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం.. 230 పాయింట్ల నష్టంతో 37 వేల 154 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 11,016 వద్ద ట్రేడవుతోంది.

ఎఫ్​ఎంసీజీ, ఐటీ మినహా మిగతా బ్యాంకింగ్​, ఆటో, ఇన్​ఫ్రా రంగాల్లో కొనుగోళ్లు క్షీణించాయి.

లాభనష్టాల్లోనివివే...

బీపీసీఎల్​, ఐఓసీ, హెచ్​పీసీఎల్​, ఏషియన్​ పెయింట్స్​, యెస్​ బ్యాంక్​, ఆర్​ఐఎల్​, యూపీఎల్​, టాటా మోటర్స్​, ఎస్​బీఐలు డీలా పడ్డాయి.

ఇండియాబుల్స్​ హౌసింగ్​, టీసీఎస్​, బెల్​, ఓఎన్​జీసీ, గెయిల్​, హుడ్కో ఆరంభ ట్రేడింగ్​లో రాణించాయి.

రూపాయి..

నేటి ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 70 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ 71.62 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Sep 30, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details