తెలంగాణ

telangana

ETV Bharat / business

'సంపన్న పన్ను'పై సమీక్ష ఆశలతో లాభాలు - ఎఫ్​పీఐ

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులపై సర్​ఛార్జీలను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రభుత్వం సమీక్షించవచ్చన్న అంచనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 243 పాయింట్లు వృద్ధితో, నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.

'సంపన్న పన్ను'పై సమీక్ష ఆశలతో లాభాలు

By

Published : Aug 9, 2019, 9:59 AM IST

శుక్రవారం స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎఫ్​పీఐలపై పన్ను సర్​ఛార్జీ విధింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవచ్చన్న వార్తలు, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్​టీసీజీ)ను సమీక్షించవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు వృద్ధిచెంది 37 వేల 570 వద్ద కొనసాగుతోంది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 76 పాయింట్లు లాభాపడి 11 వేల 109 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

పవర్​గ్రిడ్​ కార్ప్, ఆల్ట్రాటెక్ సిమెంట్​, జీ ఎంటర్​టైన్మెంట్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఇండస్​బుల్స్​ హెచ్​ఎస్​జీ, హెచ్​డీఎఫ్​సీ, లార్సెన్​, హీరోమోటో కార్ప్​ రాణిస్తున్నాయి.

నష్టాల్లో

టాటా మోటార్స్, టెక్​మహీంద్ర, భారతీ ఎయిర్​టెల్, హిందాల్కో, ఎమ్​ అండ్​ ఎమ్​, సన్​ఫార్మా, టీసీఎస్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, 10+

ABOUT THE AUTHOR

...view details