భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 503 పాయింట్లు బలపడి.. 40,261 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 144 పాయింట్ల వృద్ధితో 11,813 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, ఫార్మ, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ఉండటం వల్ల లాభాలు కాస్త పరిమితమైనట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,355 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,953 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,836 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,723 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.