తెలంగాణ

telangana

ETV Bharat / business

'ట్రేడ్​ డీల్​'పై అనిశ్చితి... ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు - బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ

హాంకాంగ్​లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 21 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేశాయి.

'ట్రేడ్​ డీల్​' అనిశ్చితి నడుమ మార్కెట్లకు స్వల్ప లాభాలు

By

Published : Nov 11, 2019, 4:49 PM IST

అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ స్టాక్​మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. హాం​కాంగ్​లో రాజకీయ సంక్షోభం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితితో మార్కెట్లలో అస్థిరత కొనసాగింది. ఒడుదొడుకుల నడుమ... సూచీల వృద్ధికి బ్యాంకింగ్​ రంగాలు ఊతమిచ్చాయి. ఎస్​ బ్యాంక్​ ఏకంగా 5 శాతానికి పైగా ఎగబాకింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 21 పాయింట్లు పెరిగి 40 వేల 345 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ స్వల్పంగా 5 పాయింట్ల లాభంతో.. 11 వేల 913 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే...

బ్యాంకింగ్​ రంగంలో భారీ లాభాలు నమోదయ్యాయి. ఎస్​ బ్యాంక్​ 5.80 శాతం వృద్ధి చెందింది. ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​, బీపీసీఎల్​, గెయిల్​, టాటా మోటర్స్ పుంజుకున్నాయి.

నెస్లే ఇండియా, టీసీఎస్​, ఆర్​ఐఎల్​, ఏసియన్​ పెయింట్స్​, మారుతీ, ఎం అండ్​ ఎం, హీరో మోటో కార్ప్​, హిందాల్కో, వేదాంత, సిప్లా నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి...

నేడు రూపాయి 18 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 71.47 వద్ద ఉంది.

ఇదీ చూడండి:రూపాయి పతనం.. పసిడికి రెక్కలు.. ఇవే నేటి ధరలు

ABOUT THE AUTHOR

...view details