ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సోమవారం చాలా సేపు నిలిచిపోవడం ఆ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి గంటలకు నిలిచిపోయిన ఈ ప్లాట్ఫామ్స్ సేవలు.. దాదాపు 7 గంటల తర్వాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఫేస్బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.
ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (నాస్డాక్లో) ఫేస్బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. దీనితో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంపద 7 బిలియన్ డాలర్లకుపైగా (రూ.52 వేల కోట్లు) తగ్గింది. ఫలితంగా ఆయన మొత్తం సంపద 121.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానానికి పడిపోయారు.