తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహన ధరలు మరోసారి పెంపు? - ముడి పదార్థాలు

ఇటీవల రెండు నెలల్లోనే ధరలు పెంచాయి వాహన తయారీ కంపెనీలు. అయితే.. మరోసారి ధరలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

vehicle rates
వాహన ధరలు

By

Published : Jul 28, 2021, 7:22 AM IST

ఇటీవలి నెలల్లోనే రెండు సార్లు ధరలు పెంచిన వాహన తయారీ కంపెనీలు, మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగటం ఇందుకు నేపథ్యం. గత 9 నెలల్లోనే ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి. దీంతో స్కూటర్ల నుంచి భారీ ట్రక్కుల వరకు తయారు చేసే కంపెనీలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు ధరలను పెంచాయి. జూన్‌ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయన్న అంచనాలు తల్లకిందులవ్వడంతో, ధరలను మళ్లీ పెంచక తప్పదని పేర్కొంటున్నాయి.

గిరాకీ తక్కువగా ఉన్నా..

గిరాకీ ధోరణిని బట్టి ద్విచక్ర వాహన కంపెనీలు.. ధరలపై ఒక నిర్ణయానికి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 'గతంలో కంపెనీలు వివిధ సందర్భాల్లో ధరలు పెంచాయి. ముడి పదార్థాల ధరలు పెరిగినపుడు, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినపుడు, జీఎస్‌టీ పెరిగినపుడు.. ఇలా గిరాకీతో సంబంధం లేకుండా పెంచాయి. ఇపుడు కూడా అంతే. గిరాకీ తక్కువగా ఉన్నా అదే పనిచేయొచ్చు.

ఎందుకంటే కారు అవసరం ఉన్నవారు తప్పక కొంటారు. ఇపుడు బ్యాంకు రుణ రేట్లు అత్యంత కనిష్ఠ స్థాయిల్లో ఉండడం వారికి కలిసిరావొచ్చ'ని ఒక బ్రోకరేజీ సంస్థ అంటోంది.

ఇదీ చదవండి:ఈ-స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇవే...

ABOUT THE AUTHOR

...view details