భారత్‌కు అప్పగింతపై లండన్ వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారించనున్నట్లు యూకే హైకోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు ఈ కేసు విచారించే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ బ్యాంకుల్లో రూ.9,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులపై విచారణలో 2018 డిసెంబర్లో లండన్ వెస్ట్‌మినిస్టర్ కోర్టు.. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు మాల్యా చేసిన మొదటి అభ్యర్థన కోర్టులో తిరస్కరణకు గురైంది.