బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు భారత్కు తిరిగి వస్తారని, చట్టాన్ని ఎదుర్కోక తప్పదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
బ్రిటన్లో తలదాచుకుంటున్న మాల్యా, నీరవ్లను రప్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు నిర్మల.
చోక్సీ అర్జెంటీనాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు.