గత ఏడాది జూన్‌తో పోలిస్తే.. 2020 ఆరో నెల తొలి అర్థభాగంలో షాపింగ్ మాల్స్ 77 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. వీధి వ్యాపారాల వృద్ధి 61 శాతం పడిపోయింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నుంచి ఇటీవల సడలింపులు ఇచ్చినా.. వినియోగదారుల్లో ఇంకా భయాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఓ నివేదిక వెల్లడించింది.
భారత రిటైలర్ల సంఘం (ఆర్ఏఐ) ఈ సర్వే చేసింది. ప్రతికూల వృద్ధి నేపథ్యంలో.. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా రిటైల్ వ్యాపారాలకు పెద్దగా ఉపయోగపడలేదని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా వినియోగదారుల్లో షాపింగ్‌పై లాక్‌డౌన్‌కు ముందు ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు లేదని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ సెంటిమెంట్ మెరుగయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.