తెలంగాణ

telangana

ETV Bharat / business

'మహా' థ్రిల్లర్​పై పారిశ్రామికవేత్తల స్పందన - మహారాష్ట్ర రాజకీయాలు

మహా ట్విస్ట్​పై ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఆనంద్​ మహీంద్రా, హర్ష్​ గొయెంకా తమదైన శైలిలో మహా రాజకీయాలపై ట్వీట్లు చేశారు.

'మహా' థ్రిల్లర్​పై పారిశ్రామికవేత్తల స్పందన

By

Published : Nov 24, 2019, 6:31 AM IST

Updated : Nov 24, 2019, 7:25 AM IST

పత్రికలు, వార్తా ఛానెళ్లల్లో హోరెత్తిన 'మహా' రాజకీయాలు.. సామాజిక మాధ్యమాల్లోనూ హాట్​టాపిక్​గా నిలిస్తున్నాయి. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేనకు భాజపా ఇచ్చిన షాక్​పై దేశ ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. మహా రాజకీయాలపై పోస్టులు, షేర్లు, ట్వీట్​లు, రీట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా.. మహా ట్విస్ట్​పై విశేషంగా స్పందించారు.

ఆనంద్​ మహీంద్రా...

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా మహా రాజకీయాలపై స్పందిస్తూ.. కబడ్డి ఆటకు సంబంధించిన ఓ పాత వైరల్​ వీడియోను రీట్వీట్​ చేశారు. రైడర్​ను చాకచక్యంగా తన ఉచ్చులో పడేసిన ఓ డిఫెండర్​ వీడియో అది.

"నేను ట్వీట్​ చేసిన ఈ వీడియో గుర్తుందా? మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయాలను వివరించడానికి ఇంత కన్నా వేరే గొప్ప మార్గం ఉందా?"
---- ఆనంద్​ మహీంద్రా, పారిశ్రామికవేత్త.

హర్ష్​ గొయెంకా...

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్​పీజీ గ్రూప్​ ఛైర్మన్​ హార్ష్​ గొయెంకా.. మహా రాజకీయాలపై "షేర్డ్​ పవార్​" అని ట్వీట్​ చేశారు. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, అజిత్​ పవార్​ల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్టుగా ఈ ట్వీట్​ సూచిస్తోంది.

హర్ష్​ గొయెంకా ట్వీట్​

కొద్ది సేపటికే.. 'మహా సీఎం పీఠం రేసు ఇంకా ముగియలేదు' అని రీట్వీట్​ చేశారు.

హర్ష్​ గొయెంకా ట్వీట్​

"ఎన్నో ట్విస్ట్​లు, ఉత్కంఠ మలుపులున్న.. నేను చూసిన 3 సినిమాలు: రేస్​, అంధాధున్, మహా సీఎం ఎవరు? ఆ మూడోదానికి ఇంకా శుభం కార్డు పడినట్టు నాకు అనిపించడం లేదు."
--- గొయెంకా, పారిశ్రామికవేత్త.

సజ్జన్​ జిందాల్​...

జేఎస్​డబ్ల్యూ గ్రూప్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సజ్జన్​ జిందాల్​.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్​కు శుభాకాంక్షలు తెలిపారు.

ఏం జరిగింది?

ప్రభుత్వస్థాపనకు కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన సన్నద్ధమవుతున్న తరుణంలో.. మహా ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ భాజపా నేత దేవంద్ర పఢణవీస్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్​సీపీ ముఖ్య నేత అజిత్​ పవార్​ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు.

Last Updated : Nov 24, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details