తెలంగాణ

telangana

ETV Bharat / business

అల్కాజర్​ లుక్ అదుర్స్​- ఎం&ఎం నుంచి ఎక్స్​యూవీ 700 - హ్యుందాయ్ అల్కాజర్​​ ఫీచర్లు

దేశీయంగా ఎస్​యూవీ సెగ్మెంట్​లో పోటాపోటీగా కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి వాహన తయారీ సంస్థలు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌​ త్వరలో ప్రీమియం సెవెన్​ సీటర్ ఎస్​యూవీ అల్కాజర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మోడల్ ఫస్ట్​లుక్​ను తాజాగా విడుదల చేసింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా కూడా ఎక్స్​యూవీ 700ను జులై-సెప్టెంబర్​ మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

New Suvs form Mahindra and Hyundai
మహీంద్రా, హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీలు

By

Published : Apr 8, 2021, 6:34 PM IST

యుటిలిటీ వాహనాలకు దేశీయంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆటోమొబైల్ కంపెనీలు ఎస్​యూవీ సెగ్మెంట్​పై పట్టు సాధించేందుకు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కొత్త కొత్త మోడళ్లను ఈ సెగ్మెంట్​లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రేసులో హ్యుందాయ్‌​, మహీంద్రా&మహీంద్రా ముందు వరుసలో ఉన్నాయి.

హ్యుందాయ్‌ అల్కాజర్​ ఫస్ట్​లుక్​..

అల్కాజర్​ పేరుతో సరికొత్త ఎస్​యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు హ్యుందాయ్‌ ఇప్పటికే​ ప్రకటించగా.. గురువారం దీనికి సంబంధించి ఫస్ట్​లుక్ విడుదల చేసింది. 6,7 సీటర్​ అల్కాజర్​ను ఈ నెలాఖరున మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

అల్కాజర్ ఎస్​యూవీ ఫస్ట్​ లుక్​
అల్కాజర్ ఎస్​యూవీ ఫస్ట్​ లుక్​

సరికొత్త ప్రీమియం అల్కాజర్​ పెట్రోల్​, డీజిల్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 2 లీటర్​ ఇంజిన్​తో, డీజిల్ వేరియంట్​ 1.5 లీటర్​ ఇంజిన్​తో తేనుంది హ్యుందాయ్‌​.

హ్యుందాయ్‌​ అల్కాజర్​.. మహీంద్రా ఎక్స్​యూవీ 500, ఇటీవల విడుదలైన టాటా సఫారీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

ఈ నెలాఖరున మార్కెట్లోకి ఈ ప్రీమియం ఎస్​యూవీని విడుదల చేయనుంది హ్యుందాయ్‌.

ఎం&ఎం నుంచి ఎక్స్​యూవీ 700..

మహీంద్రా & మహీంద్రా ఎస్​యూవీ సెగ్మెంట్​ అయిన ఎక్స్​యూవీ పోర్ట్​పోలియోలో మరో కొత్త మోడల్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్​యూవీ 300, ఎక్స్​యూవీ 500కు అప్​గ్రేడ్​ వెర్షన్​గా.. ఎక్స్​యూవీ 700 కారును.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విడుదల చేయనుంది.

భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎక్స్​యూవీ 700ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. డీజిల్​, పెట్రోల్ వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:ఆ కార్లపై అదిరే ఆఫర్లు- 75వేల వరకు డిస్కౌంట్లు

ABOUT THE AUTHOR

...view details