తెలంగాణ

telangana

ETV Bharat / business

Mahindra: మహీంద్రా కార్లు మరింత ప్రియం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా.. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న కార్ల(Mahindra cars) ధరలను పెంచింది. ఈ ఏడాదిలో మూడోసారి పెరగటం గమనార్హం. అత్యధికంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 'థార్'(Mahindra thar) ధర వేరియంట్‌ను బట్టి రూ.42,300-1,02,000లు పెరిగింది.

Mahindra cars
మహీంద్రా కార్లు

By

Published : Jul 11, 2021, 10:53 AM IST

Updated : Jul 11, 2021, 12:47 PM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ సంస్థ నుంచి వస్తున్న కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది మహీంద్రా కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి. కార్ల తయారీలో వినియోగించే విలువైన లోహాల ధరలు పెరగడంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాలు పెరిగాయని.. ఆ ప్రభావం నుంచి కొంత వరకైనా బయటపడేందుకు వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనున్నామని సంస్థ పేర్కొంది.

అత్యధికంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 'థార్' ధర వేరియంట్‌ను బట్టి రూ.42,300-1,02,000లు పెరిగింది. ఇతర మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది..

మోడల్‌ ధర పెరిగిన మొత్తం(రూ.లలో)

  • కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ రూ.3,016-రూ.3,344
  • బొలెరో రూ.21,000-రూ.22,600
  • ఎక్స్‌యూవీ 300 రూ.5,000-రూ.24,000
  • ఎక్స్‌యూవీ 500 రూ.2,912-రూ.3,188
  • మరాజో రూ.26,000-రూ.30,000
  • స్కార్పియో రూ.30,000-రూ.40,000
  • అల్టురాస్‌జీ4 రూ.3,094

ఇదీ చదవండి :ల్యాప్​టాప్​ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి

Last Updated : Jul 11, 2021, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details