స్టాక్ మార్కెట్లకు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కరోనా వ్యాక్సినేషన్ వార్తలు, కార్పొరేట్ల మూడో త్రైమాసిక ఫలితాలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 8న టీసీఎస్ 2020-21 క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ వారమే తయారీ, సేవా రంగ పీఎంఐ గణాంకాలూ విడుదల కానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సూచీలు గత వారం రికార్డు స్థాయిల వద్ద ముగిసిన నేపథ్యంలో మదుపరులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.