తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక గణాంకాలు, అమెరికా- చైనా పరిణామాలే కీలకం - స్టాక్​ మార్కెట్ వార్తలు తెలుగు

ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాల(ముఖ్యంగా అమెరికా-చైనా సంబంధాల) ప్రభావం ఈ వారం స్టాక్​ మార్కెట్లపై ప్రధానంగా ఉండనుంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సిన్ ట్రయల్స్ వార్తలూ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలుగా ఉండనున్నాయి.

share market news
ఈ వారం స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 9, 2020, 12:20 PM IST

స్టాక్ మార్కెట్లపై ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వైరస్​ వార్తలు ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి.

ఈ వారమే ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ గణాంకాల ఆధారంగా మదుపరుల స్పందన ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2 కోట్లకు చేరువైన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్​పై ప్రభావం పడే అవకాశం ఉందని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్​పై సానుకూల సమాచారం వస్తే.. మదుపరుల సెంటిమెంట్​ బలపడొచ్చని అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య ఇంకా పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతుండటం వల్ల మార్కెట్లు ఈ వారం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వారం త్రైమాసిక ఫలితాలు ప్రకటించే కంపెనీల్లో.. బ్యాంక్ ఆఫ్​ బరోడా, సెంట్రల్​ బ్యాంక్, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, ఎంఆర్​ఎఫ్​, ఎన్​టీపీసీ ప్రధానంగా ఉన్నాయి. ఈ కంపెనీల ప్రకటనలు కూడా ఈ వారం ట్రేడింగ్​ను ప్రభావితం చేయనున్నాయి.

వీటితోపాటు ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:'మన సత్తా పెరగాలి.. చైనా కట్టడికి ఇదే మార్గం'

ABOUT THE AUTHOR

...view details