ఉద్యోగులు దేశీయంగా చేసిన విహారయాత్రల్లాంటి ప్రయాణాలకు అయిన ఖర్చులకు.. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందడానికి లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) (LTA exemption) ఉపయోగపడుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం నాలుగేళ్ల వ్యవధిలో (బ్లాక్) రెండు ప్రయాణాలకు మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. మరి ఈ రెండు ప్రయాణాలు నాలుగేళ్లలో ఎప్పుడైనా చేయొచ్చా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు.
ప్రయాణాలు చేసేప్పుడు.. వెళ్లి వచ్చేందుకు ఎలాంటి నిర్దిష్ట నియమ నిబంధనలు లేవు. అంటే.. దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు. అలాగే.. నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు అంటే ఏడాది విడిచి ఏడాది అనే నిబంధనా లేదు. కాబట్టి నాలుగేళ్ల వ్యవధిలో(బ్లాక్) ఏవైనా రెండు ప్రయాణాలకు సంబంధించి పన్ను మినహాయింపుల కోసం ఎల్టీఏను(LTA exemption) క్లెయిమ్ చేసుకోవచ్చు.