వంట గ్యాస్ రాయితీపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) వినియోగదారులెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. వినియోగదారుల రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. సంస్థను ప్రైవేటీకరించినా ఈ విధానంలో మార్పు ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీకి గ్యాస్ సంస్థ యాజమాన్యంతో సంబంధం లేదని వివరించారు.
2020-21 ఏడాదికి గాను పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా బీపీసీఎల్లోని 53 శాతం వాటాను విక్రయిస్తోంది కేంద్రం. నిర్వహణా బాధ్యతలను కూడా ప్రైవేటు యాజమాన్యానికే అప్పజెప్తోంది.