వంటగ్యాస్ ధరలు వచ్చే నెల తగ్గే అవకాశముందని పెట్రోలియం, సహజవాయువు వ్యవహారాల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన ఎల్పీజీ ధరల పెరుగుదలపై ఈ విధంగా స్పందించారు.
"ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయటం వాస్తవం కాదు. ఈ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటం వల్లనే వంటగ్యాస్ ధరలు పెరిగాయి. శీతకాలంలో గ్యాస్ వాడకం పెరుగుతుంది. వేసవిలో తగ్గుతుంది. వచ్చే నెలలో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. "