దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Gas price) భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచే సవరించిన ధరలు అమలులోకి రానున్నాయి.
బండ బాదుడు- ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.266 పెంపు - బండ బాదుడు
08:44 November 01
బండ బాదుడు- ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.266 పెంపు
తాజా పెంపుతో దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర (LPG Cylinder price in Delhi) రూ.2000.50కు చేరింది. ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉంది. అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ఎల్‌పీజీ ధరలను(Lpg Gas Cylinder Price) క్రమంగా పెంచుతూ వాటిపై సబ్సిడీని గత ఏడాది తొలగించింది ప్రభుత్వం.
ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.