పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాకిచ్చాయి.
రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. 15రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. డిసెంబర్ 2న కూడా సిలిండర్ ధర రూ.50 పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.