వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. 15 రోజుల్లోనే వంట గ్యాస్ ధరలు పెరగటం ఇది రెండో సారి. రాయితీలేని 14.2 కిలోల సిలిండర్ ధర బుధవారం రూ.25 పెరిగి.. రూ.884.50 (దిల్లీలో) వద్దకు చేరింది.
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు - రాయితీ లేని సిలిండర్ ధర ఎంత
వంట గ్యాస్
09:47 September 01
పెరిగిన వంట గ్యాస్ ధర..
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వంట గ్యాస్ ధర రూ.190 పెరింది. దాదాపు ఏడేళ్లలో సిలిడర్ ధరలు రెట్టింపైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014 మార్చిలో 14.2కిలోల సిలిండర్ ధర రూ.410.50గా ఉండటం గమనార్హం.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధర కూడా రూ.75 పెరిగింది. దీనితో కమర్షియల్ సిలిండర్ ధర (దిల్లీలో) రూ.1693కు చేరింది.
ఇదీ చదవండి:Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Last Updated : Sep 1, 2021, 10:49 AM IST