వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డీలర్ వద్ద రీఫిల్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఈ మేరకు పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ) జాబితా ప్రకారం తమ ప్రాంతంలో ఉన్న పంపిణీదారుల వద్ద గ్యాస్ రీఫిల్ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండానే మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పోర్టబులిటీ చేసుకోవచ్చని తెలిపింది.
అయితే అదే సంస్థకు చెందిన వేరే పంపిణీదారుడికి(డీలర్) మార్చుకోవడానికే వినియోగదారులకు వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిని ఫైలట్ ప్రాజెక్టు కింద చండీగఢ్, కోయంబత్తూర్, గురుగ్రామ్, పుణె, రాంచీలలో ప్రారంభించనున్నారు.
ఈ సేవ ఎలా పొందాలంటే..?