వరుసగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ల జోరుకు గురువారం అడ్డుకట్టపడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 149 పాయింట్లు కోల్పోయి.. 40,558 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,896 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, హెవీ వెయిట్, బ్యాంకింగ్ షేర్లలో నమోదైన లాభాల స్వీకరణ ప్రభావం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,721 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,309 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,939 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,853 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.