తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ ధరలో 'ఎస్​యూవీ' కావాలా? ఇవి ట్రై చేయండి! - మహీంద్రా ఎక్స్ యూవీ 300

కార్లలో హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్​యూవీ, స్పోర్ట్స్ ఇలా పలు రకాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పలు కారణాల వల్ల ఎస్​యూవీల కొనుగోలుకే ఎక్కువ మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో బడ్జెట్ ధరకు అందుబాటులో ఉన్న ఎస్​యూవీల వివరాలు తెలుసుకుందాం.

cars
కార్లు, ఎస్​యూవీ

By

Published : Jun 19, 2021, 11:55 AM IST

కరోనా వల్ల ప్రజారవాణా కంటే సొంతవాహనాలకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు కార్లు కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. వీరిలో చాలామంది ఆకర్షణీయంగా ఉండే ఎస్​యూవీలను కోరుకుంటున్నారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే విధంగా ఉండటంతో పాటు లగ్జరీ లుక్, సామర్థ్యమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

ఎస్​యూవీలకు పెరుగుతున్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని ఆయా వాహన కంపెనీలు సైతం పలు రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి. స్థాయికి తగ్గట్లు మోడళ్లు ఉండే విధంగా చూసుకుంటున్నాయి. బడ్జెట్ ధరల్లో ఉన్న ఉత్తమ ఎస్​యూవీల వివరాలు మీకోసం..

రెనో కైగర్..

  • ఫిబ్రవరిలో రెనో కైగర్​ భారతదేశ మార్కెట్లోకి విడుదలైంది. ఇది ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్​-టీ, ఆర్ఎక్స్-జెడ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి రూ.10.08 లక్షల వరకు ఉంది. 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ దీనికి ఉంది.
    రెనో కైగర్..
  • 1.0 లీటర్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ వెర్షన్లలో కైగర్ లభిస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్​లో 5 స్పీడ్ ఆటో, మ్యానువల్ మోడ్​లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్​లో కేవలం మ్యానువల్ మోడ్ మాత్రమే ఉంది.
  • ఎల్ఈడీ హెడ్ ల్యాంప్​లు, వైర్​లెస్ ఛార్జింగ్, 8ఇంచ్ టచ్ స్క్రీన్​ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ ప్లే, స్టార్-స్టాప్ పుష్ బటన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ పీఎం 2.5 ఎయిల్ ఫీచర్​​లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి.

ఇదీ చదవండి:అదిరే లుక్​తో హ్యుందాయ్‌ 7 సీట్ల అల్కజార్

నిస్సాన్ మాగ్నైట్

  • మాగ్నైట్ ధర రూ.5.59 లక్షల నుంచి రూ.10.00 లక్షల వరకు ఉంది. 999 సీసీ ఇంజిన్​తో ఉన్న ఈ ఎస్​యూవీ.. ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్వీ, ఎక్స్​వీ ప్రీమియం, ఎక్స్​వీ ప్రీమియం(ఓ) వేరియంట్లలో లభిస్తుంది. సీటింగ్ కెపాసిటీ 5 కాగా.. కేవలం పెట్రోల్ వేరియంట్​ను మాత్రమే నిస్సాన్ విడుదల చేసింది.
    నిస్సాన్ మాగ్నైట్
  • 1.0 లీటర్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వర్షన్ ఇంజిన్ ఆప్షన్ తీసుకోవచ్చు. 1.0 లీటర్ కేవలం మ్యానువల్ గేరింగ్ ట్రాన్స్​మిషన్ ఉండగా... టర్బో పెట్రోల్ వెర్షన్​లో సీవీటీ ఆఫ్షన్ కూడా ఉంది. 8ఇంచ్ ఇన్ఫోటెయిన్​మెంట్ సిస్టమ్, వైర్​లెెస్ ఆండ్రాయిడ్ ఆటో-యాపిల్ కార్ ప్లే, 16 ఇంచుల డ్యుయల్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఈ వాహనంలో ఉన్నాయి.
  • ఎక్స్-వీ, ఎక్స్-వీ ప్రీమియంలు వైర్​లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, హై ఎండ్ జేబీఎల్ స్పీకర్లు, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్స్, యాంబియెంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:వచ్చే నెల నుంచి కొత్త కార్ల సందడి షురూ!

టాటా నెక్సాన్

  • నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.19 లక్షలు కాగా.. రూ.12.95 లక్షల వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్​ నుంచి వచ్చిన కార్లలో విజయవైంతమైన మోడల్ ఇది. 1199-1497 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో.. మొత్తం 18 వేరియంట్లలో లభిస్తుంది.
    టాటా నెక్సాన్
  • 1.2 లీటర్ టర్బో ఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో ఛార్జ్​డ్ డీజిల్ ఇంజిన్ల​లో అందుబాటులో ఉంది. రెండిట్లోనూ 6 స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమేటిక్ వెర్షన్లలో ఉన్నాయి. 7ఇంచ్ టచ్ స్క్రీన్​ ఇన్ఫోటెయిన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటోప్లే, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, రియల్ ఏసీ వెంట్స్​తో కూడిన ఆటో ఏసీ సదుపాయాలు ఉన్నాయి. డ్యుయల్ ఫ్రంట్ ఏయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్పీ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్ యూవీ 300

  • ఎక్స్​యూవీ 300 ధర రూ.7.95-రూ.13.09 లక్షల మధ్య ఉంది. 1197-1497 సీసీ ఇంజిన్​తో వస్తోన్న ఈ వాహనం డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8(ఓ) వేరియంట్లలో లభిస్తుంది. ఐదు సీట్ల సామర్థ్యం ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
    మహీంద్రా ఎక్స్ యూవీ 300
  • 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను ఎంచుకోవచ్చు. రెండు ఇంజిన్లకు కూడా ఆటోమేటిక్, మ్యానువల్ ట్రాన్స్​మిషన్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, 7ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటెయిన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రెయిన్(rain) సెన్సింగ్ వైపర్స్, ఆటో ఏసీ సదుపాయాలు ఉన్నాయి. ఏడు ఎయిర్ బ్యాగ్​లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:భారత్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..

మారుతీ సుజుకీ విటారా బ్రెజా

  • మారుతీ సుజుకీ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో బ్రెజా ఒకటి. దీని ధర రూ.7.51-రూ.11.41 లక్షల వరకు ఉంది. 1462 సీసీ ఇంజిన్ దీనికి ఉంది. ఐదు సీటర్ల సామర్థ్యంతో.. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో లభిస్తోంది.
    మారుతీ సుజుకీ విటారా బ్రెజా
  • 5 స్పీడ్ మ్యానువల్ లేదా 4 స్పీడ్ ఏఎంటీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. క్రూజ్ కంట్రోల్, హైట్ అడ్జెస్టేబుల్ డ్రైవర్ సీట్, ఆటో ఏసీ, 7ఇంచ్​ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో-యాపిల్ కార్ ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత పరంగా డ్యుయల్ ఫ్రంట్ ఏయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవీ చదవండి:Yamaha: ఎఫ్​జెడ్​-ఎక్స్​ విడుదల- ధర ఎంతంటే?

కారుకు మళ్లీ 'కరోనా' బ్రేకులు- తగ్గిన విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details