తెలంగాణ

telangana

ETV Bharat / business

'అన్​లాక్​ 1.0' ప్రారంభించాలి: ఆనంద్​ మహీంద్రా - మహీంద్రా గ్రూప్ ఛైర్మన్

లాక్​డౌన్ పొడిగింపుపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్​డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు, ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో 'అన్​లాక్​ 1.0' ప్రారంభించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Lockdown needs to have a defined tenure: Anand Mahindra
అన్​లాక్​ 1.0 ప్రారంభించాలి: ఆనంద్​ మహీంద్రా

By

Published : May 30, 2020, 8:27 PM IST

మరో విడత లాక్​డౌన్ పొడిగింపుపై మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా విభిన్నంగా స్పందించారు. లాక్​డౌన్ అనే పదానికే దూరంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

అన్​లాక్​ 1.0 ప్రారంభించాలి: ఆనంద్​ మహీంద్రా

"లాక్​డౌన్ అనేది పరిమిత కాలంపాటు మాత్రమే ఉండాలి. ఇప్పడు నాలుగో విడత లాక్​డౌన్ ముగిస్తోంది. కనుక ఈ తరుణంలో 'అన్​లాక్​ 1.0' ప్రారంభించాల్సిన అవసరం ఉంది."

- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​

ఆరోగ్య సంక్షోభం కూడా..

పదే పదే లాక్​డౌన్​ పొడిగింపు వల్ల ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా మానసిక రోగాలు ఉత్పన్నమవుతాయని, ఫలితంగా ఆరోగ్య సంక్షోభం కూడా తలెత్తే అవకాశముందని అన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం విధాన రూపకర్తలకు చాలా కష్టమైన పనేనని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అయితే లాక్​డౌన్​ పొడిగింపు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:లక్షణాలు లేకున్నా.. 28శాతం మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details