తెలంగాణ

telangana

ETV Bharat / business

'రూ.6 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించండి' - Industry demands relief package

దేశ వ్యాప్తంగా మరోసారి లాక్​డౌన్ పొడిగించినప్పటికీ.. కొన్ని సడలింపులు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశాయి పరిశ్రమ వర్గాలు. అయితే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గాడినపడేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని​ కోరాయి.

Lockdown 3.0: Industry demands relief package of Rs 6 lakh crores, cut in GST rates
లాక్​డౌన్ సడలించినా.. ప్యాకెజీని ప్రకటించండి

By

Published : May 4, 2020, 9:09 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ 3.0 నేటి నుంచి ప్రారంభమైంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్​ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా .. కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు, డేటా, కాల్​ సెంటర్​ల వంటి వాటికి నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అయితే కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాయి.

కొత్త మార్గదర్శకాలతో 'మే'లే..

కొత్త మార్గదర్శకాలతో మే 4నుంచి మరో రెండు వారాలపాటు పొడిగించిన లాక్​డౌన్ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తోడ్పడనున్నట్లు పరిశ్రమల విభాగం ఫిక్కీ అధ్యక్షురాలు సంగీత రెడ్డి అన్నారు. అయితే ఇంకా చాలా కీలక ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయే ఉంటాయని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహానికి ఇదే సరైన సమయమని.. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు..

కేంద్రం అనుమతిచ్చినవాటిలో.. సెజ్​, పారిశ్రామిక ఎస్టేట్​లు, ఇండస్ట్రియల్​తో పాటు​ మేము ఏదైతే కోరామో వాటిని అనుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పరిశ్రమల సామాక్య సీఐఐ డైరెక్టర్​ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.

మూడింట ఒక వంతు ఉద్యోగులతో ప్రైవేటు రంగ సేవా సంస్థలను తెరించేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంపై సీఐఐ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే పరిశ్రమలు తిరిగి పుంజుకునేందుకు జీడీపీలో 3 శాతానికి సమానమైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీఎస్టీ రేట్లు తగ్గించి.. రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని కోరారు చంద్రజిత్​.

ఆంక్షలతో కూడిన ఆర్థిక కార్యకలాపాలకు.. తక్షణమే భారీ ఆర్థిక మద్దతు ఇచ్చినా పరిశ్రమ వెంటనే కోలుకోకపోవచ్చని చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

వెంటనే ప్యాకేజీ ఇవ్వాలి..

ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్న పరిశ్రమల విభాగం అసోచామ్.. వెంటనే భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈటీవీ భారత్​కు ఇచ్చిన సమాచారంలో పరిశ్రమల విభాగం అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్.. ప్రభుత్వ ప్యాకేజీలు జీఎస్టీ తగ్గింపు వంటికి కూడా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రభుత్వం వెంటనే బ్యాంకులకు అన్ని బకాయిలు, గ్యారంటీలు విడుదల చేయాలని..దాని ద్వారా బలహీనపడ్డ కంపెనీలకూ రుణాలు ఇవ్వగలగుతారని ఆయన తెలిపారు.

కేంద్రం మార్గదర్శకాలు ఇలా..

కొత్త నిబంధనల ప్రకారం.. అత్యవసర సరకుల తయారీ, ఔషధ, ఫార్మా, మెడికల్ డివైజ్​లు, వాటి ముడి సరుకు ఉత్పత్తికి అనుమతిస్తున్నట్లు కేంద్రం హోం శాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details