తెలంగాణ

telangana

ETV Bharat / business

ముద్ర రుణాలు @రూ. 15లక్షల కోట్లు - pradhan mantri mudra yojana news

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఇప్పటి వరకు రూ. 14.96 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ రుణాల ద్వారా 28.68 లక్షల మంది లబ్ధిపొందారని స్పష్టం చేసింది.

Loans of Rs 14.96 lakh crore sanctioned since launch of PM Mudra scheme
'ముద్ర పథకం కింది రూ.14.96 లక్షల కోట్లు విడుదల'

By

Published : Apr 7, 2021, 1:47 PM IST

ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద 28.68లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు కేంద్రం తెలిపింది. వీరికి సుమారు రూ. 14.96లక్షల కోట్లు మేర రుణం మంజూరు చేసినట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని బ్యాంకింగ్​, బ్యాంకింగేతర, మైక్రో ఫినాస్స్​ సంస్థల నుంచి ఇచ్చినట్లు వెల్లడించింది.

"సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపార ఔత్సాహికుల నుంచి రైతుల వరకు అర్హులైన అందరికీ ఈ పథకం కింది లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అడుగులు వేస్తోంది."

- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది కన్న కలలు నెరవేరాయని, మరెంతో మంది ఆశయాలకు, ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని ఆర్థికశాఖ తెలిపింది. లబ్ధిదారులకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని పేర్కొంది.

ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్​ 8న ప్రారంభించారు. నాన్​ కార్పొరేటు సంస్థలకు, వక్తులకు,చిన్న, మధ్య తరగతి ఔత్సాహికులకు రూ.10 లక్షల వరకూ రుణం అందిస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్​బీఐ

ABOUT THE AUTHOR

...view details