మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ కల్పించి రుణగ్రహీతలకు ఊరట కల్పించామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. ఇంకా ఉపశమనాలు ఇస్తే ఆ ఆర్థిక ఒత్తిడిని బ్యాంకింగ్ రంగం తట్టుకోలేదని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది.
మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇది పూర్తిగా ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశమని, దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.